మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-06-22T13:09:39+05:30 IST

రాజధాని తరలింపుపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా సమస్య

మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: రామకృష్ణ

అమరావతి: రాజధాని తరలింపుపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా సమస్య ముగిసిన వెంటనే రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి చెప్పటం తగదన్నారు. ఇదే విషయమై సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రాజధాని అంశంపై విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. మూడు రాజధానుల విషయాన్ని శాసన మండలి సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని మంత్రి పెద్దిరెద్ది చెప్పటం కోర్టు ధిక్కరణ కాదా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-22T13:09:39+05:30 IST