మాచర్ల నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఎలా ఇస్తారు?: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-03-13T20:39:47+05:30 IST

మాచర్లలో దాడి చేసిన వాళ్లపై హత్యాయత్నం కేసు పెట్టామని చెప్పి.. నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఎలా ఇస్తారు? అని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు

మాచర్ల నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఎలా ఇస్తారు?: రామకృష్ణ

విజయవాడ: మాచర్లలో దాడి చేసిన వాళ్లపై హత్యాయత్నం కేసు పెట్టామని చెప్పి.. నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఎలా ఇస్తారు? అని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. నేరం చేయని రాజధాని రైతులను మాత్రం 10 రోజులు జైల్లో ఉంచారని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. డీజీపీ ఆఫీసు వద్ద ధర్నా చేసినా కళ్లు తెరవలేదని మండిపడ్డారు. దౌర్జన్యాలు చేస్తే ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? అని నిలదీశారు. ఈ విషయాలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-03-13T20:39:47+05:30 IST