పోలవరం సాధనకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-11-03T14:32:58+05:30 IST
అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో జరిగిన అధికారుల సమావేశం
అమరావతి: సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో జరిగిన అధికారుల సమావేశం వివరాలు వెల్లడించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరం నిర్మాణంలో కేంద్రం మెలికలు పెడుతోందని విమర్శించారు. పోలవరం విషయమై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం సాధనకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు.