హోదాపై మభ్యపెట్టే మాటలెందుకు?: సీపీఐ రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-29T07:53:13+05:30 IST

హోదాపై మభ్యపెట్టే మాటలెందుకు?: సీపీఐ రామకృష్ణ

హోదాపై మభ్యపెట్టే మాటలెందుకు?: సీపీఐ రామకృష్ణ

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై ఇంకా ప్రజలను మభ్యపెట్టే మాటలెందుకు? ప్రత్యేక హోదా క్రేందం వేసే భిక్ష కాదు... హక్కుగా పోరాడి సాధించుకోవాల్సింది. ప్రత్యేక హోదా, విభజన హామీలను ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు అని సీఎం మాట్లాడడం సరికాదు. అమిత్‌ షా చెబితే పరిమళ్‌ నత్వానికి రాజ్యసభ సీటు కేటాయించిన సమయంలో కూడా ప్రత్యేక హోదా ఎందుకు అడగలేకపోయారు?’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌ని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.  కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీతో ఉంది కాబట్టి ప్రత్యేక హోదా అడగలేకపోతున్నామంటూ   జగన్‌ మాటమారుస్తున్నారని విమర్శించారు.  

Updated Date - 2020-05-29T07:53:13+05:30 IST