హామీ లేకుండా రుణాలు ఇస్తామన్నారేగానీ... వడ్డీ లేకుండా..: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-17T16:26:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ ప్రభుత్వరంగాన్ని ప్యాకింగ్ చేసి పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నట్లుగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.

హామీ లేకుండా రుణాలు ఇస్తామన్నారేగానీ... వడ్డీ లేకుండా..: రామకృష్ణ

అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ ప్రభుత్వరంగాన్ని ప్యాకింగ్ చేసి పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నట్లుగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదన్నారు. హామీ లేకుండా రుణాలు ఇస్తామన్నారేగానీ... వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామనలేదని చెప్పారు. కేంద్ర ఆర్థిక ప్యాకేజీ మళ్లీ కేంద్రానికి చేరే విధంగా పథకం రూపొందించారని చెప్పారు. స్వదేశీ జపం చేస్తూనే విదేశీ, పెట్టుబడిదారుల అనుకూల విధానాలను అవలంబిస్తోందన్నారు. రక్షణ రంగంలో 74% ఎఫ్‌డీఐలను అనుమతించటం దుర్మార్గమన్నారు. ఏవియేషన్, ఇస్రో, మైనింగ్, విద్యుత్ వంటి పలు రంగాలను ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు సంస్కరణలు చేపట్టిందన్నారు. కరోనా విపత్తును కేంద్రం తనకు అనుకూలంగా మలుచుకోవడం సరికాదన్నారు.   

Updated Date - 2020-05-17T16:26:29+05:30 IST