‘ఒప్పంద కార్మికులను తొలగించడం దారుణం’

ABN , First Publish Date - 2020-05-17T10:27:19+05:30 IST

ఆర్టీసీలో ఒప్పంద ఉద్యోగులను తొలగించడంపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

‘ఒప్పంద కార్మికులను తొలగించడం దారుణం’

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో ఒప్పంద ఉద్యోగులను తొలగించడంపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌  వల్ల పరిస్థితి బాలేదనే సాకుతో ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు 7600 మందిని తొలగించడం దారుణమన్నారు. శనివారం ఈ మేరకు సీఎంకు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ఓ ప్రకటనలో... ‘‘ఏపీఎస్‌ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు తక్షణం జీతం బకాయి చెల్లించాలి. ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా తెలపాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-05-17T10:27:19+05:30 IST