విజయవాడలో సీపీఐ నిరసన

ABN , First Publish Date - 2020-05-13T17:55:43+05:30 IST

పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..

విజయవాడలో సీపీఐ నిరసన

విజయవాడ: పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ  దాసరి భవన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసనకు దిగారు. ఇప్పటికే కోవిడ్ ప్రభావంతో అన్ని వర్గాల ప్రజలు కుదేలయ్యారని... ఇటువంటి సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. రెండు నెలలకు సంబంధించిన రీడింగ్ ఒకే సారి తియ్యడంతో టారిఫ్ కూడా మారిపోయిందని సీపీఐ నేతలు తెలిపారు. కొత్త టారిఫ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పేర్ని నాని కరెంట్ ఛార్జీలపై వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం సరికాదని...అలాంటి బెదిరింపులకు తాము బెదరమని సీపీఐ నేతలు స్పష్టం చేశారు. 

Read more