జగన్ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడరని భావిస్తున్నా: నారాయణ

ABN , First Publish Date - 2020-07-22T18:19:37+05:30 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభ దిశగా వెళ్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.

జగన్ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడరని భావిస్తున్నా: నారాయణ

అమరావతి: ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభ దిశగా వెళ్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందిగా గవర్నర్ ఆదేశించటం శుభపరిణామమన్నారు. రాజ్యాంగ రీత్యా జగన్ ప్రభుత్వానికి అన్నిదారులు మూసుకుపోయాయన్నారు. ఇప్పటికైనా జగన్ విజ్ఞత ప్రదర్శించకపోతే రాజ్యాంగ సంక్షోభమేనన్నారు. రాజకీయాలలో ఎంతటివారికైనా పట్టువిడుపులు అవసరమన్నారు. జగన్ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడరని ఆశిస్తున్నానని నారాయణ పేర్కొన్నారు.


Updated Date - 2020-07-22T18:19:37+05:30 IST