ప్రముఖ శాస్త్రవేత్త అమర్‌జసాని అభిప్రాయాన్ని గౌరవించాలి: నారాయణ

ABN , First Publish Date - 2020-07-05T14:59:11+05:30 IST

ప్రముఖ శాస్త్రవేత్త అమర్‌జసాని అభిప్రాయాన్ని గౌరవించాలి: నారాయణ

ప్రముఖ శాస్త్రవేత్త అమర్‌జసాని అభిప్రాయాన్ని గౌరవించాలి: నారాయణ

అమరావతి: కోవిడ్-19 వాక్సిన్‌కు సంబంధించి ప్రముఖ శాస్త్రవేత్త అమర్‌జసాని అభిప్రాయాన్ని గౌరవించాలని సీపీఐ నేత నారాయణ తెలిపారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయని... వ్యాక్సిన్‌ విజయవంతం కావాలని అందరం కోరుకుందామని పేర్కొన్నారు. రాజకీయ నేతలు తొందరపడి కాలాన్ని ప్రకటించడం సరికాదన్నారు. దీని వల్ల శాస్త్రవేత్తలకు అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయని నారాయణ తెలిపారు. 


ప్రముఖ శాస్త్రవేత్త అమర్‌జసాని వ్యాఖ్యలు ఇవే....

కరోనా వ్యాక్సిన్‌ రేసులో అమెరికా, బ్రిటన్‌, చైనా ముందున్నాయని వార్తలు వింటూ ఉన్నాం. ఈ దేశాలలో మానవ పరీక్షలు మూడో దశకు చేరుకున్నాయి. అయినా వారెవ్వరూ వ్యాక్సిన్‌ సమీప భవిష్యత్తులో సిద్ధమవుతుందని చెప్పటం లేదు. 2021 ప్రధమార్థంలో వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. మనం మాత్రం మొదటి, రెండో దశల మానవ పరీక్షలు పూర్తికాకుండానే వ్యాక్సిన్‌ ఎప్పు డు వస్తుందనే విషయంపై చర్చ ప్రారంభించేశాం. వాస్తవానికి పరీక్షలపై ఐసీఎంఆర్‌ రాసిన లేఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి తయారీలో కలగజేసుకోవటమే! మానవ పరీక్షలు జరిపేటప్పుడు- అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వా తే అనుమతులివ్వాలని మార్గదర్శకాలున్నాయి. ఐసీఎంఆర్‌ లేఖ దీనికి విరుద్ధం. ఇప్పటి దాకా రెండు దశల కు అనుమతి ఇచ్చారు. మూడో దశ మాటేమిటో చెప్పలేదు. ప్రభుత్వం తన లబ్ధి కోసం సైన్స్‌కు సంబంధించిన ప్రక్రియలలో వేలు పెట్టాలని ప్రయత్నించటం మంచిది కాదు.

Updated Date - 2020-07-05T14:59:11+05:30 IST