‘ప్రభుత్వ భూములపై వేసిన సిట్ నివేదిక ఎక్కడ?’
ABN , First Publish Date - 2020-10-24T23:07:45+05:30 IST
‘ప్రభుత్వ భూములపై వేసిన సిట్ నివేదిక ఎక్కడ?’

అమరావతి: గీతంపై అర్ధరాత్రి దాడులు చేయాల్సిన అవసరమేంటి? అని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. గీతం కూల్చివేత చర్య రాజకీయ కక్ష సాధింపేనని చెప్పారు. ప్రభుత్వ భూములపై వేసిన సిట్ నివేదిక ఎక్కడ? అని ప్రశ్నించారు. అమరావతిని కోరుకునే పార్టీలు 29 గ్రామాల్లోనే కాదు..రాష్ట్రమంతా ఉద్యమించాలని ఆయన సూచించారు. కేంద్రాన్ని పోలవరం నిధులు ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. టీఎస్, ఏపీఎస్ ఆర్టీసీ మధ్య పేచీతో ప్రైవేట్ ట్రావెల్స్‌కు లబ్ది చేకూరుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయని వ్యాఖ్యానించారు.