ఆ పధకాలను కొనసాగించండి...సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-06-04T13:05:27+05:30 IST

ఆ పధకాలను కొనసాగించండి...సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ఆ పధకాలను కొనసాగించండి...సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

విజయవాడ: బెస్ట్ అవైలబుల్ స్కూల్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఇంటర్మీడియట్ పధకాలను కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఈ పథకాల కింద ఇప్పటికే 29,200 మంది విద్యనభ్యసిస్తున్నారని... వీరిలో 70% మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులున్నారని తెలిపారు. దివంగత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆపేయటం తగునా? అని ప్రశ్నించారు. బిఎయస్, సిఈఎస్  పధకాలను ఈ విద్యా సంవత్సరం నుండి నిలిపివేయడం సరికాదని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-04T13:05:27+05:30 IST