వలస కార్మికులను పట్టించుకోవడం లేదు: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2020-04-21T17:52:04+05:30 IST
వలస కార్మికులను పట్టించుకోవడం లేదు: సీపీఐ రామకృష్ణ

విజయవాడ: కరోనా కారణంగా రాష్ట్రంలో లక్షల సంఖ్యలో వలస కార్మికులు కష్టాలు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వలస కార్మికుల ఈ విషయంలో కేంద్రం సూచనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను మనుషులుగా కూడా చూడటం లేదని విమర్శించారు.
దాదాపు ఐదు కోట్ల 30 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు గోడౌన్లలో ఉన్నాయన్నారు. బియ్యం, గోధుమలు రాష్ట్రాలకు పంపిణీ చేసి కార్మికులకు పంచాలని..చనిపోయిన వలస కార్మికుల కుటుంబాలకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగ కార్మికుల సొమ్ము సంక్షేమ నిధిలో ఉందని...ఏపీలో ఉన్న 20 లక్షల మందికి డబ్బులు ఇవ్వాలన్నారు. మార్చి24న కేంద్రమంత్రి స్వయంగా లేఖ రాసినా...సీఎం స్పందించడం లేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో విధులు నిర్వహిస్తున్న వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. శానిటేషన్ సిబ్బందికి జీతాలు కూడా చెల్లచలేదన్నారు. కరోనాను లెక్క చేయకుండా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని.. లేకుంటే పోరాటం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.
రైతుల నష్టపోతున్నారు: ముప్పాళ్ల నాగేశ్వరరావు
రైతుల ధాన్యం కేంద్రాలలో కొనుగోళ్లు సాగడం లేదని అన్నారు. మొక్లజొన్నను దళారులు కొని.. రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విధుల్లో పాల్గొంటున్న జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.