రైతాంగాన్ని ఆదుకోండి...సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ
ABN , First Publish Date - 2020-04-25T14:21:12+05:30 IST
రైతాంగాన్ని ఆదుకోండి...సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. కరోనా లాక్‌డౌన్ వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని తెలిపారు. పండ్ల తోటల రైతులకు రవాణా సౌకర్యం, మార్కెటింగ్ సౌకర్యం లేక పంటను తోటల్లోనే వదిలేస్తున్నారన్నారు. అప్పులు తెచ్చి పంట వేసిన ఆక్వా, మొక్కజొన్న, అరటి, చీని రైతులు లబోదిబోమంటున్నారని ఆయన చెప్పారు. అనంతపురం, కడప ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిని పర్యటింప చేయాలని...రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణమే నిర్దిష్ట చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.