ఖైదీలను విడుదల చేయండి..సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-04-21T14:17:48+05:30 IST

ఖైదీలను విడుదల చేయండి..సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ఖైదీలను విడుదల చేయండి..సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: కరోనా కల్లోలం నేపథ్యంలో జైళ్లలో ఉన్న ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిల్‌పై విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోందని...కరోనా పాజిటివ్ కేసులు 722కు చేరాయన్నారు. టెస్టులు పెరిగే కొద్దీ పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తమ కుటుంబసభ్యులకు ఏమవుతుందోనని ముద్దాయిలు, ఖైదీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం జైళ్లను ఖాళీ చేసి కరోనా విపత్తు సద్దుమణిగాక తిరిగి ముద్దాయిలను జైలుకు పంపవచ్చని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-21T14:17:48+05:30 IST