ఆ ఇళ్లను తక్షణమే కేటాయించండి...సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-07-20T13:53:58+05:30 IST

ఆ ఇళ్లను తక్షణమే కేటాయించండి...సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

ఆ ఇళ్లను తక్షణమే కేటాయించండి...సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉన్నాయన్నారు. నిన్న తాము జగ్గయ్యపేటలో ఆయా ఇళ్లను పరిశీలించడం జరిగిందని...ఆయా ఇళ్లను ప్రజల డబ్బుతోనే నిర్మించారేగాని ఏ ఒక్క పార్టీ సొంత నిధులతో కాదని గ్రహించాలని సూచించారు. తెలుగుదేశంపై తమకున్న కక్షను ప్రజలపై తీర్చుకోవటం సరికాదన్నారు. వాలంటీర్లు బెదిరించి 'ఆ ఇల్లు మాకొద్దని' లబ్ధిదారులుచే సంతకాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-20T13:53:58+05:30 IST