కూలీలు, పేద, సామాన్య ప్రజానీకానికి గడ్డుకాలం: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-03-25T16:05:45+05:30 IST

అమరావతి: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీని పెంచాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

కూలీలు, పేద, సామాన్య ప్రజానీకానికి గడ్డుకాలం: రామకృష్ణ

అమరావతి: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీని పెంచాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణకు మోదీ 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించారన్నారు. దేశవ్యాప్తంగా రోజువారీ కూలీలు, పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి ఇది గడ్డుకాలమన్నారు. ప్రధాని ప్రకటించిన రూ.15 వేల కోట్లు ప్యాకేజీ ఏమాత్రం సరిపోదన్నారు. కనీసం 2, 3 లక్షల కోట్ల రూపాయలైనా కేటాయించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని కూడా పెంచాలన్నారు. రేషన్‌తో పాటు కుటుంబానికి రూ.1,000 ఇస్తే చాలదని.. కనీసం కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.


Updated Date - 2020-03-25T16:05:45+05:30 IST