‘ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు భద్రత పెంచాలి’

ABN , First Publish Date - 2020-03-19T00:43:20+05:30 IST

ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు భద్రత పెంచాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీసుకున్న...

‘ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు భద్రత పెంచాలి’

అమరావతి: ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు భద్రత పెంచాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారన్నారు. తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిలపక్షం నిర్వహించాలని సూచించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేసి నామినేషన్ల నుంచి తిరిగి ప్రారంభించాలని సీపీఐ నేత రామకృష్ణ కోరారు. 

Updated Date - 2020-03-19T00:43:20+05:30 IST