మంత్రి బాలినేని రాజీనామా ఎవరు కోరారు?: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-03T14:57:48+05:30 IST

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ స్మార్ట్ మీటర్ల కోసం రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.

మంత్రి బాలినేని రాజీనామా ఎవరు కోరారు?: రామకృష్ణ

అమరావతి: రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ స్మార్ట్ మీటర్ల కోసం రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా ఎవరు కోరారని నిలదీసిన ఆయన గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకోవడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల కోసం కేంద్రం అనుమతికై ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు సై అన్నదని వ్యాఖ్యానించారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మరో రూ.వెయ్యి కోట్ల వృథా ఖర్చు అవసరమా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌పై రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు రామకృష్ణ తెలిపారు. 

Updated Date - 2020-09-03T14:57:48+05:30 IST