కేంద్రం వైఖరి కుట్రపూరితం
ABN , First Publish Date - 2020-10-28T08:58:38+05:30 IST
పోలవరంపై కేంద్రం కుట్రపూరిత వైఖరి అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

సీపీఐ నేత రామకృష్ణ ధ్వజం
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): పోలవరంపై కేంద్రం కుట్రపూరిత వైఖరి అవలంభిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇస్తాం తప్ప.. నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని చెప్పడం ద్రోహం చేయడమేనన్నారు. ఏ జాతీయ ప్రాజెక్టుకైనా నిర్వాసితుల పునరావాసానికి నిధులు ఇవ్వనని కేంద్రం మెలిక పెట్టిన దాఖలాలున్నాయా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, పోలవరం అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నదన్నారు.