టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వెనక్కి తీసుకోవాలి: మధు

ABN , First Publish Date - 2020-05-24T17:56:06+05:30 IST

టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వెనక్కి తీసుకోవాలి: మధు

టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వెనక్కి తీసుకోవాలి: మధు

విజయవాడ: టీటీడీ ఆస్తుల విక్రయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. దాతలు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చారని... దాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మకానికి మాత్రం కాదని అన్నారు. వాటిపై వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆస్తులు అమ్మడం మొదలు పెడితే అవి అమ్ముకుంటూ పోతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అమ్మకానికి పెడితే అడ్డుకన్న వైసీపీ... ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమే ఆలయ ఆస్తులు అమ్మకానికి పెట్టాడం సరికాదని మధు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-24T17:56:06+05:30 IST