టీటీడీ బోర్డు చైర్మన్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-04-24T13:57:42+05:30 IST

టీటీడీ బోర్డు చైర్మన్‌కు రామకృష్ణ లేఖ

టీటీడీ బోర్డు చైర్మన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: కరోనా విపత్తు నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి జిల్లాకు రూ.1కోటి చొప్పున ఇస్తామంటూ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నారంటూ వచ్చిన వార్తలపై టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ప్రతి జిల్లాకు రు.1 కోటి చొప్పున ఇస్తామని, పలు ప్రాంతాల్లో ఆహార సదుపాయాలు కల్పిస్తామని ఇటీవల టీటీడీ ప్రకటించిందని... అయితే నిన్న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసిందని అన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా కడుపునిండా తిండి లేక, నిలువ నీడ లేక పేదలు, వలస కూలీలు, సామాన్య ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ఏ మతానికి చెందిన దేవుడైన ప్రజాహితం కోరిన వారే అని ఆయన అన్నారు. తక్షణం గతంలో ప్రకటించిన విధంగా 13 జిల్లాలకు జిల్లాకు రూ.1కోటి చొప్పున నిధులు విడుదల చేయగలరని...అలాగే పలుచోట్ల టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగించగలరని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-24T13:57:42+05:30 IST