పాలనపై శ్వేతపత్రం విడుదల చేయండి: వైసీపీకి సీపీఐ డిమాండ్

ABN , First Publish Date - 2020-06-06T12:40:28+05:30 IST

ఏడాది పాలనలో ఏ రంగంలో అభివృద్ధి సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర

పాలనపై శ్వేతపత్రం విడుదల చేయండి: వైసీపీకి సీపీఐ డిమాండ్

విజయవాడ: ఏడాది పాలనలో ఏ రంగంలో అభివృద్ధి సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఏ రంగంలో అభివృద్ధి సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ఈ ఏడాది కాలంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు నిలిచిపోవటం నిజం కాదా?, 65 అంశాలను వివాదాస్పదం చేసి కోర్టుల చుట్టూ తిరగటమే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్దా?, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-06-06T12:40:28+05:30 IST