-
-
Home » Andhra Pradesh » CPI
-
డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి: సీపీఐ
ABN , First Publish Date - 2020-05-18T10:18:28+05:30 IST
డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి, వివాదానికి స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి, వివాదానికి స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ఈ మేరకు ఆదివారం లేఖ రాశారు. కరోనాను ఎదుర్కొనేందుకు సరైన వైద్య పరికరాలు లేవన్న చిన్నమాటకే డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేయడం, అందుకు నిరసన తెలిపినందుకు ఆయన పెడరెక్కలు విరిచి కట్టి, నడిరోడ్డుపై కొట్టి అవమానించడం సరికాదని రామకృష్ణ పేర్కొన్నారు.