కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా..: సీపీఎం

ABN , First Publish Date - 2020-12-15T16:55:41+05:30 IST

కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా..: సీపీఎం

కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా..: సీపీఎం

విజయవాడ: సీపీఎం నేత సీహెచ్ బాబూరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళన నేపథ్యంలో గృహ నిర్భంధాలలో భాగంగాపలువురు కార్మిక నేతల హౌస్‌అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేశారు. కరోనా, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవని బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా.. అరెస్టులు చేస్తున్నారిన మండిపడ్డారు. ముందస్తు అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణిచివేయడం గర్హనీయమన్నారు. 


Read more