పోలవరానికి మమ్మల్నీ అనుమతించాలి: సీపీఐ

ABN , First Publish Date - 2020-12-15T09:18:49+05:30 IST

పోలవరం సందర్శనకు ప్రతిపక్షాలను, రైతు సంఘాలను అనుమతించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

పోలవరానికి మమ్మల్నీ అనుమతించాలి: సీపీఐ

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): పోలవరం సందర్శనకు ప్రతిపక్షాలను, రైతు సంఘాలను అనుమతించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు సీఎంకు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్‌ పోలవరంలో పర్యటించి, అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించడం మంచి పరిణామమేనన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అనేకసార్లు ప్రాజెక్టును సందర్శిస్తున్నారన్నారు. కానీ తన నేతృత్వంలో సీపీఐ ప్రతినిధి బృందం పర్యటనకు వెళ్లేందుకు సిద్ధంకాగా, పోలీసులు అభ్యంతరం చెబుతూ ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని విమర్శించారు.

Read more