‘అలాకాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’
ABN , First Publish Date - 2020-10-01T18:30:06+05:30 IST
‘అలాకాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం’
చిత్తూరు: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేయటం లేదంటూ చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.