ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల ఈ సమస్యలు తలెత్తే అవకాశం..!
ABN , First Publish Date - 2020-04-05T18:50:37+05:30 IST
దేశ ప్రజలంతా ఆదివారం రాత్రి 9 నుంచి 9:09 గంటల వరకూ దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే...

విజయవాడ : దేశ ప్రజలంతా ఆదివారం రాత్రి 9 నుంచి 9:09 గంటల వరకూ దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పిలుపుపై ఏపీఎస్పీడీసీఎల్ (APCPDCL) చైర్మన్, ఎండీ పద్మ జనార్ధన రెడ్డి స్పందించారు. ఈ రోజు రాత్రి 09: 00 నుంచి 9:09 వరకూ తొమ్మిది నిమిషాల పాటు లైట్లు ఆర్పివేయాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు.
దీపాల వెలుగులో ఉండేలా ప్రతి ఇంట్లో తొమ్మిది దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపు నిచ్చారు. ఒకేసారి లైట్లు ఆర్పడం ద్వారా గ్రిడ్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అయితే ఆ సమయంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ అధికారులు కొన్ని నియమాలు పాటించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలివీ...
:- ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి అన్ని కెపాసిటర్ బ్యాంకులను స్విచ్ ఆఫ్ చేయాలి
:- ఆక్వా కల్చరల్ మోటోలో 33/11 కెవి సబ్స్టేషన్లలో ఆర్ఎస్ సేవలో ఉండాలి
:- అన్ని 1IKV అగ్రికల్చరల్ ఫీడర్లను రాత్రి 08.00 సమయంలో 09.30కి మార్చాలి
:- దేశీయ వినియోగదారులందరూ వారి కొన్ని ఏసీలను ఆన్ చేయాలి
:- వాటర్ మోటార్స్, ఫ్రిజ్‌లు మరియు సాధారణ లైటింగ్
:- సిమెంట్ ఫ్యాక్టరీలు, పల్వరైజర్స్ పరిశ్రమలకు వారి పారిశ్రామిక భారాన్ని రాత్రి 08.00 నుంచి 09.30 మధ్య నడపడానికి సూచనలు అందించాలి
:- M&P వింగ్ మరింత అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండాలి
:- మైనర్, మేజర్ పంచాయతీలు, నగరాలు, మునిసిపాలిటీల యొక్క అన్ని వీధి దీపాలు ఆన్‌లో ఉండాలి
:- వాటర్ వర్క్స్, ఆర్‌డబ్ల్యుఎస్ ఆన్ చేయాలి
:- పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓఎల్టిసి ట్యాప్ చేంజర్‌ను సాధారణ స్థితిలో ఉంచాలి
అన్ని సూపరింటెండింగ్ ఇంజనీర్లు/ఆపరేషన్‌పై సూచనలను సూక్ష్మంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.