-
-
Home » Andhra Pradesh » CP Manish Kumar Sinha Varalakshmi family members
-
వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీపీ మనీష్ కుమార్ సిన్హా
ABN , First Publish Date - 2020-11-27T21:07:43+05:30 IST
గాజువాక సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను సీపీ మనీష్ కుమార్ సిన్హా శుక్రవారం పరామర్శించారు.

విశాఖ: గాజువాక సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను సీపీ మనీష్ కుమార్ సిన్హా శుక్రవారం పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిల్ పక్కా పథకం ప్రకారమే వరలక్ష్మిని హత్య చేశాడని చెప్పాడు. అఖిల్ తప్పించుకునేందుకు కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కేసును దిశ పీఎస్‌కు బదిలీ చేసి, వారం రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని సీపీ పేర్కొన్నారు.