పింఛన్‌పై కౌంటర్ వేయండి: హైకోర్టు
ABN , First Publish Date - 2020-04-21T10:21:38+05:30 IST
కరోనా కలకలం దృష్ట్యా రిటైర్డ్ ఉద్యోగులకు కూడా రెండు విడతల్లో పింఛను ఇవ్వాలన్న నిర్ణయంపై పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర

అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కరోనా కలకలం దృష్ట్యా రిటైర్డ్ ఉద్యోగులకు కూడా రెండు విడతల్లో పింఛను ఇవ్వాలన్న నిర్ణయంపై పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పింఛన్ వ్యవహారానికి సంబంధించిన చట్ట నిబంధనలు, ప్రభుత్వాధికారాలు తదితర వివరాలతో ఈ నెల 23వ తేదీలోగా ఈ కౌంటర్ సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులకు జీతం, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛను రెండు విడతల్లో ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31వ తేదీన జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రిటైర్డ్ ఉద్యోగులకు 50 శాతం పింఛను చెల్లించే ఆ జీవోను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది జంద్యాల రవిశంకర్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే.