బ్రేకింగ్ : కడప జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-03-13T22:12:00+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

బ్రేకింగ్ : కడప జిల్లాలో కరోనా కలకలం

కడప : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ 125 దేశాల్లో కల్లోల్లం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలకూ పాకడం.. తెలంగాణలో ఒకరికి కరోనా సోకడం.. మరోవైపు పెద్ద ఎత్తున అనుమానిత కేసులు నమోదవుతుండటంతో ఇరు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు.. నెల్లూరు జిల్లాకు కరోనా పాకింది. ఇటలీ నుంచి వచ్చిన ఒకరికి వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది.


ఇదిలా ఉంటే.. కడప జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని బెల్లంమండికి చెందిన మహిళ ఖైరూన్‌కు కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో హుటాహుటిన కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో ప్రత్యేక విభాగంలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు చేస్తున్నారని సమాచారం. కాగా.. ఖైరూన్‌ ఇటీవలే మక్కా వెళ్లి వచ్చినట్లు తెలిసింది. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2020-03-13T22:12:00+05:30 IST