పెదకూరపాడు నియోజకవర్గంలో ఆరుగురు కరోనా అనుమానితులు

ABN , First Publish Date - 2020-03-31T00:47:39+05:30 IST

దకూరపాడు నియోజకవర్గంలో ఆరుగురు కరోనా అనుమానితులను అధికారులు గుర్తించారు. వీరంతా ఢిల్లీలో మతపరమైన సమావేశంలో పాల్గొన్నట్లుగా గుర్తించారు.

పెదకూరపాడు నియోజకవర్గంలో ఆరుగురు కరోనా అనుమానితులు

గుంటూరు: పెదకూరపాడు నియోజకవర్గంలో ఆరుగురు కరోనా అనుమానితులను అధికారులు గుర్తించారు. వీరంతా ఢిల్లీలో మతపరమైన సమావేశంలో పాల్గొన్నట్లుగా గుర్తించారు. క్రోసూరు మండలంలో ముగ్గురు, అచ్చంపేట మండలంలో ముగ్గురిని గుర్తించారు. అనుమానితులను కాటూరి ఆస్పత్రి క్వారంటైన్‌కు తరలించారు. 


మరోవైపు గుంటూరుకు చెందిన కరోనా పాజిటివ్ వ్యక్తితో కలిసి రైలులో ప్రయాణం చేసిన 22 మందిని అధికారులు గుర్తించారు. 9 మంది హౌస్ క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరో 13 మంది ఏలూరు ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2020-03-31T00:47:39+05:30 IST