-
-
Home » Andhra Pradesh » coronavirus Lockdown kanna babu
-
కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రాంతాలకు తరలిస్తున్నాం: కన్నబాబు
ABN , First Publish Date - 2020-03-23T21:44:19+05:30 IST
కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రోజుకు 50శాతం మంది చొప్పున రైతులు విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అమరావతి: కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రోజుకు 50శాతం మంది చొప్పున రైతులు విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చేపలు, ఇతర మాంసాహార మార్కెట్లను బహిరంగ ప్రాంతాలకు తరలిస్తామని, మార్చ్ 31 వరకు గుంటూరు మార్కెట్ మిర్చి యార్డ్ లాక్‌డౌన్ చేయాలని ఆదేశించారు. సరిహద్దులు మూసివేతతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో అంతర్గత రవాణాకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. పాలు, మాంసం విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు లేవని కన్నబాబు తెలిపారు.