-
-
Home » Andhra Pradesh » Coronavirus cpi narayana jagan
-
కేసీఆర్ ఆత్మవిశ్వాసంలో జగన్‌కు 10 శాతమైనా ఉందా?
ABN , First Publish Date - 2020-03-23T09:53:39+05:30 IST
రోనా వైర్‌సపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నారో ఏపీ సీఎం జగన్ దానిలో 10% ఆత్మవిశ్వాసం ప్రకటించగలరా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.

సీపీఐ నేత నారాయణ ప్రశ్న
హైదరాబాద్ మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నారో ఏపీ సీఎం జగన్ దానిలో 10% ఆత్మవిశ్వాసం ప్రకటించగలరా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. మానవ జీవితంలో తప్పులు చేయడం సహజమని, తప్పులు సమర్ధించుకోడానికి నూరు తప్పులు చేయడమా? అని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని దాన్ని హుందాగా తీసుకున్నవారే రాజకీయాల్లో రాణించగలుగుతారని అన్నారు. గతంలో ఒకసారి వైఎస్ సీఎంగా ఉండగా కలువడానికి వెళితే, చూడగానే అక్కున చేర్చుకున్నారని వివరించారు. అయితే, అక్కడే ఉన్న కేవీపీ స్పందిస్తూ ‘‘నారాయణను చూడగానే పంచ నిల్వదా నీకు.. నిన్ను బయట ఎన్ని బూతులు తిడుతున్నాడో తెలియదా?’’ అన్నారు. దీనికి వైఎస్.. నారాయణ కమ్యూనిస్టు నేత. నన్ను విమర్శించకుండా ఉంటాడా? అన్నారు. అది రాజకీయ నీతి సూత్రం. నేను బాధతోనే ఈ విషయం చెబుతున్నా అని నారాయణ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, జనతా కర్ఫ్యూ సందర్భంగా మణికొండలోని తన నివాసంలో నారాయణ యోసనాలు వేస్తూ కాలక్షేపం చేశారు. సాయంత్రం 5 గంటలకు సతీమణి వసుమతితో కలిసి ఈల వేసి చప్పట్లు కొడుతూ సంఘీభావం ప్రకటించారు.