కృష్ణా జిల్లాను చుట్టేస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-19T00:19:00+05:30 IST

కరోనా మహమ్మారి జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోంది. జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటోంది. ఇప్పటివరకు విజయవాడకే పరిమితం కాగా, ఇప్పుడు జిల్లావ్యాప్తంగా వైరస్‌ విస్తరించడం ఆందోళన కల్గిస్తోంది.

కృష్ణా జిల్లాను చుట్టేస్తున్న కరోనా

విజయవాడ: కరోనా మహమ్మారి జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోంది. జిల్లాలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటోంది. ఇప్పటివరకు విజయవాడకే పరిమితం కాగా, ఇప్పుడు జిల్లావ్యాప్తంగా వైరస్‌ విస్తరించడం ఆందోళన కల్గిస్తోంది. గురువారం జిల్లాలో 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగరంలో  22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆరు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడలోని కృష్ణలంకలో 3, ఊర్మిళ నగర్ లో 2, వైఎస్సార్ కాలనీలో 2, గొల్లపూడిలో 2, కొత్తపేటలో 3, న్యూ అర్‌అర్‌అర్‌పేటలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని మచిలీపట్నంలో 2, ఉయ్యూరులో 2, ఉతుకురులో 2 కేసులు నమోదయ్యాయి. 


కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సుదీర్ఘకాలంపాటు అమలు చేసిన లాక్‌డౌన్‌ నిబంధనలను ఇటీవల సడలించడంతో కరోనా చాపకింద నీరులా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంటోంది. గతంలో మాదిరిగా ఆంక్షలు, నిబంధనలు లేకపోవడంతో ప్రజలు బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. దీంతో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-19T00:19:00+05:30 IST