ఏపీలో 4 వేలు దాటిన కరోనా మరణాలు
ABN , First Publish Date - 2020-09-02T01:09:24+05:30 IST
ఏపీలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకూ 4 వేల 53 మందిని ఈ వైరస్ కబలించింది....

అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకూ 4 వేల 53 మందిని ఈ వైరస్ కబలించింది. తాజాగా కరోనా వైరస్ మరో 10,368 మందికి సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 84 మంది చనిపోగా 9 వేల 350 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 4 లక్షల 45 వేల 139 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షా 12 వందల 10 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ 3 లక్షల 39 వేల 876 మంది రికవరీ అయ్యారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో మొత్తం 37 లక్షల 82 వేల 746 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
