హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయల్దేరిన వలస కూలీలు

ABN , First Publish Date - 2020-04-14T22:45:40+05:30 IST

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ పొడిగించడంతో వలస కూలీలు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయల్దేరారు.

హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయల్దేరిన వలస కూలీలు

హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ పొడిగించడంతో వలస కూలీలు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం బయల్దేరారు. పూటగడవడం కష్టంగా మారిందని వలస కూలీలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌ బియ్యం తమకు అందలేదని కూలీలు చెప్పారు. పూటగడవడం కష్టంగా మారిందని పిల్లాపాపలతో కలిసి ఊరుబాట పట్టారు. ఉప్పల్‌ స్టేడియం వద్ద వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌ ముగిసేవరకు వసతి, భోజనం కల్పిస్తామని వలస కూలీలకు ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 3 వరకు పొడిగించారు. 19 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-04-14T22:45:40+05:30 IST