ఏపీలో కరోనా విలయతాండవం.. 3963 పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-07-18T22:01:57+05:30 IST

ఏపీలో కరోనా వైరస్ మరింతగా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 3963 కరోనా

ఏపీలో కరోనా విలయతాండవం.. 3963 పాజిటివ్ కేసులు

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ మరింతగా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 3963 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు స్పష్టం చేసింది. 1411 మంది కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్ల వెల్లడించింది. కోవిడ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరులో 8 మంది, కృష్ణాలో 8 మంది, అనంతపురంలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు కోవిడ్ వల్ల మృతిచెందారు. Updated Date - 2020-07-18T22:01:57+05:30 IST