-
-
Home » Andhra Pradesh » corona virus effect two persons visakhapatnam
-
విశాఖలో ఇద్దరికి కరోనా లక్షణాలు
ABN , First Publish Date - 2020-03-13T18:29:47+05:30 IST
విశాఖలో ఇద్దరికి కరోనా లక్షణాలు

విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించింది. తాజాగా విశాఖలో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. సింగపూర్, ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. వారికి సంబంధించిన శాంపిల్స్‌ను పుణెకు పంపించారు. మరోవైపు ఇప్పటి వరకు 14 అనుమానిత కేసుల్లో 12 నెగిటివ్ రాగా, మిగిలిన రెండు రిపోర్టులు రావాల్సి ఉంది. అలాగే అటు ఎయిర్‌పోర్టులో 8,467 మందికి, విశాఖ పోర్టులో 1,088 మందికి అధికారులు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు.