కరోనా విధుల్లో ఉన్నవారికి పీపీఈలు సమకూర్చాలి: పవన్‌

ABN , First Publish Date - 2020-04-07T23:46:46+05:30 IST

విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా కల్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు.

కరోనా విధుల్లో ఉన్నవారికి పీపీఈలు సమకూర్చాలి: పవన్‌

హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా కల్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. కరోనా విధుల్లో ఉన్నవారికి పీపీఈలు సమకూర్చాలని పవన్‌ పేర్కొన్నారు. ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే మెరుగైన సమాజం స్థాపితమవుతుందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. వైద్యులు, సిబ్బంది సేవలు సాహసోపేతమైనవి అని పవన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పవన్ అభినందనలు తెలిపారు.

Read more