నెల్లూరులో తొలి కరోనా మరణం.. 56కు చేరిన పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-14T13:46:57+05:30 IST

నెల్లూరులో తొలి కరోనా మరణం.. 56కు చేరిన పాజిటివ్ కేసులు

నెల్లూరులో తొలి కరోనా మరణం.. 56కు చేరిన పాజిటివ్ కేసులు

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 56కు చేరాయి. తడలో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించింది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ ఆర్ధోపెడిక్ డాక్టర్ మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే నిర్వహించగా కుటుంబసభ్యులు ఎవరూ కూడా హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయన భార్య, ఫార్మాసిస్ట్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 

Updated Date - 2020-04-14T13:46:57+05:30 IST