కరోనా బాధిత కుటుంబాలను ఊళ్లోకి అనుమతించని గ్రామస్తులు

ABN , First Publish Date - 2020-07-29T03:03:41+05:30 IST

కరోనా బాధిత కుటుంబాలను ఊళ్లోకి అనుమతించని గ్రామస్తులు

కరోనా బాధిత కుటుంబాలను ఊళ్లోకి అనుమతించని గ్రామస్తులు

విశాఖపట్నం: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. విశాఖ జిల్లాలోని నాతవరం మండలం అనంతపద్మనాభ పురంలో కరోనా బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలో సుమారుగా 33 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ నమోదైన వ్యక్తులను క్వారంటైన్ కు తరలించగా, వారి కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేసేందుకు టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో ఆ కుటుంబాలను ఊళ్లోకి గ్రామస్తులు అనుమతించలేదు. గత నాలుగు రోజుల నుంచి గ్రామానికి దూరంగా వ్యవసాయ భూముల్లో, పశువుల పాకలో బాధిత కుటుంబ సభ్యులు తలదాచుకుంటున్నారు. 


Updated Date - 2020-07-29T03:03:41+05:30 IST