ఏపీ పోలీసు శాఖకు కిమ్స్ అధినేత భారీ విరాళం

ABN , First Publish Date - 2020-04-08T02:13:10+05:30 IST

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు కిమ్స్ ఆస్పత్తుల అధినేత భాస్కర్‌రావు భారీ విరాళాన్ని ప్రకటించారు.

ఏపీ పోలీసు శాఖకు కిమ్స్ అధినేత భారీ విరాళం

మంగళగిరి, గుంటూరు: కోవిడ్‌ –19 కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో అహోరాత్రులు విధులు నిర్వహిస్తూ కృషి చేస్తున్న పోలీసులకు కిమ్స్ అధినేత తన వంతు సాయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు కిమ్స్ ఆస్పత్రుల అధినేత భాస్కర్‌రావు భారీ విరాళాన్ని ప్రకటించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సహాయనిధికి రూ.50 లక్షల విరాళాన్ని భాస్కర్ రావు అందించారు.


మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నర్ పాల్గొన్నారు. ఆరోగ్య భద్రత ద్వారా ఇప్పటికే పోలీస్ శాఖకు కిమ్స్ ఆస్పత్రి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చి సహాయసహకారాలు అందించిన కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యానికి ఏపీ డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.

Read more