అధికారుల నిర్లక్ష్య వైఖరి.. కరోనా మృతదేహాన్ని రిక్షాలో తరలింపు

ABN , First Publish Date - 2020-08-13T01:05:07+05:30 IST

అధికారుల నిర్లక్ష్య వైఖరి.. కరోనా మృతదేహాన్ని రిక్షాలో తరలింపు

అధికారుల నిర్లక్ష్య వైఖరి.. కరోనా మృతదేహాన్ని రిక్షాలో తరలింపు

గుంటూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే కొంత మంది అధికారులు కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాపట్లలో కోవిడ్ మృతుని పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. కరోనాతో మరణించిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కరోనా మృతదేహానికి కనీసం ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఆస్పత్రి సిబ్బంది అది కూడా చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో కరోనా మృతదేహాన్ని తీసుకెళ్తున్న ఫొటోలు ప్రసారం అవడం చూసి అధికారులకు ఫోన్ చేసి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-13T01:05:07+05:30 IST