డిప్యూటీ సీఎంపై టీడీపీ నేత కామెంట్స్

ABN , First Publish Date - 2020-04-27T01:26:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై టీడీపీ నేత హరిప్రసాద్ విమర్శలు గుప్పించారు.

డిప్యూటీ సీఎంపై టీడీపీ నేత కామెంట్స్

కడప: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై టీడీపీ నేత హరిప్రసాద్ విమర్శలు గుప్పించారు. భౌతిక దూరం పాటించకుండా రాపిడ్ కిట్లను ప్రారంభించడంపై హరిప్రసాద్ మండిపడ్డారు. సాయిపేట, కేకేహెచ్‌ వాడలోని ఆస్పత్రుల్లో భౌతికదూరం పాటించకుండా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా రాపిడ్‌ కిట్లను ప్రారంభించడం దారుణమని టీడీపీ నేత హరిప్రసాద్‌ అన్నారు. వైసీపీ మంత్రులు, నాయకులకు కరోనా వైరస్ చుట్టమా? అని హరిప్రసాద్‌ ప్రశ్నించారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కచ్చితంగా అందరూ సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది.

Updated Date - 2020-04-27T01:26:09+05:30 IST