కరోనా ఎఫెక్ట్.. రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు
ABN , First Publish Date - 2020-04-09T02:29:52+05:30 IST
విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు.

విజయవాడ: విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం, పాతరాజరాజేశ్వరిపేట, రాణిగారితోట, ఖుద్దూస్ నగర్, పాయకాపురం, కానూరులోని సనత్ నగర్లో లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 9వరకే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.