-
-
Home » Andhra Pradesh » Corona virus
-
కరోనాపై ఎన్నారైలలో అవగాహన పెంచాలి
ABN , First Publish Date - 2020-03-24T09:49:18+05:30 IST
కరోనా వైర్‌సపై ప్రవాసాంధ్రుల్లో అవగాహన పెంచాలని ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) అధ్యక్షుడు తాళ్లూరి ...

తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్
గుంటూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సపై ప్రవాసాంధ్రుల్లో అవగాహన పెంచాలని ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ సూచించారు. ప్రధానంగా విదేశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వస్తున్న ప్రవాసాంధ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆత్మ రక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ అ నే అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రవాసాంధ్రులు, తానా సహకరిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు దేశాల్లో ఉపాధి, ఉద్యోగ, విద్య, ఇతర రంగాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు స్వదేశానికి వస్తున్నప్పుడు ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు పరిశోధనల్లో తేలినందున ప్రవాసాంధ్రులు కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.