నంద్యాల ఎమ్మెల్యేకి కరోనా

ABN , First Publish Date - 2020-12-30T08:15:21+05:30 IST

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

నంద్యాల ఎమ్మెల్యేకి కరోనా

రాష్ట్రంలో మరో 326 కేసులు


అమరావతి, కర్నూలు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోం ఐసోలేషన్‌కు పరిమితమైన ఆయన తనకు కరోనా సోకిందని, ప్రస్తతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. వా రం క్రితం ఎమ్మెల్యే తండ్రికి కూడా కరోనా సోకింది. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 326 కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,81,599కి చేరింది. తాజాగా కృష్ణాలో 67, గుంటూరులో 56, చిత్తూరులో 52, విశాఖపట్నంలో 41 కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరి మృతితో మరణాల సంఖ్య 7,100కి చేరుకుంది. తెలంగాణలోని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కరోనా బారినపడ్డార. 

Updated Date - 2020-12-30T08:15:21+05:30 IST