తండ్రి మృతదేహానికి కన్నకొడుకుతో కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-28T17:29:44+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది.

తండ్రి మృతదేహానికి కన్నకొడుకుతో కరోనా పరీక్షలు

ప.గో.జిల్లా: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. చనిపోయిన వ్యక్తి మృత దేహం నుంచి కరోనా పరీక్షలకు కావాల్సిన శ్వాబ్ నమూనాలను ఆరోగ్యశాఖ సిబ్బంది అతని కొడుకుచేత తీయించారు. కూలి పని చేసుకునే ఆ యువకుడు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా శ్వాబ్ నమూనాలను సేకరించాడు. 


ఏలూరు రూరల్ మండలం, మల్కాపురం గ్రామానికి చెందిన 52 ఏళ్ల రేవులగడ్డ ప్రసాద్ ఏలూరు కోవిడ్ ఆశ్రం ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతను ఇంటివద్దే గుండెపోటుతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ వైద్య ఉద్యోగులు మృత దేహానికి కరోనా పరీక్షలు చేయాలని మృతిని బంధువులకు తెలిపారు. అయితే కరోనా పరీక్షలు చేయాల్సిన ఏఎన్ఎం టెస్టు చేయడానికి భయపడింది. ఆమెతో వచ్చిన గ్రామ సచివాలయ ఉద్యోగులు తామూ చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో మృతుడి కుమారుడు రవికుమార్‌తో శ్వాబ్ నమూనాలు తీయించారు.

 

Updated Date - 2020-07-28T17:29:44+05:30 IST