కరోనా టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం

ABN , First Publish Date - 2020-07-15T00:19:49+05:30 IST

నగరంలోని ఛాతి ఆస్పత్రి వద్ద కరోనా టెస్టులు చేయించుకునేందకు కరోనా అనుమానితులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడ కరోనా టెస్టులు చేయడం లేదంటూ

కరోనా టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం

విశాఖపట్నం: నగరంలోని ఛాతి ఆస్పత్రి వద్ద కరోనా టెస్టులు చేయించుకునేందకు కరోనా అనుమానితులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అయితే ఇక్కడ కరోనా టెస్టులు చేయడం లేదంటూ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది వారిని వెనక్కి పంపించేస్తున్నారు. రోజుల తరబడి ఛాతి ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఓ మహిళ భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో తాను కూడా టెస్టు చేయించుకోవడానికి ఓ మహిళ చెస్ట్ ఆస్పత్రికి వచ్చింది. వారం రోజుల నుంచి ఆమె టెస్టుల కోసం ఆస్పత్రి చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ అధికారులు ఆమెకు టెస్టులు చెయ్యలేదు. అధికారుల తీరుపై కరోనా అనుమానితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు టెస్టులు నిర్వహించాలని కోరుతున్నారు.

Updated Date - 2020-07-15T00:19:49+05:30 IST