తిరుపతిలో ఓ యువకుడికి కరోనా లక్షణాలు
ABN , First Publish Date - 2020-04-01T13:55:11+05:30 IST
తిరుపతి: ఓ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని అధికారులు హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు.

తిరుపతి: ఓ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని అధికారులు హుటాహుటిన క్వారంటైన్‌కు తరలించారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను పద్మావతి నిలయంలోని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పరీక్షల కోసం వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. మరికాసేపట్లో రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. దీంతో బాలాజీనగర్ మూడో లైన్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. స్థానికులంగా ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా అనుమానితుడు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నాడనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.